30 అడుగుల అభిమానం

Artist makes massive marble chip portrait of Shah Rukh Khan on a Kolkata rooftop - Sakshi

వైరల్‌

‘జవాన్‌’తో మరో పెద్ద విజయాన్ని అందుకున్నాడు షారుక్‌ఖాన్‌. అభిమానులు ఖుషీ ఖుషీగా ఉన్నారు. కోల్‌కత్తాకు చెందిన షారుక్‌ఖాన్‌ అభిమాని, చిత్రకారుడు ప్రీతమ్‌ బెనర్జీ మార్బుల్‌ స్టోన్‌ చిప్స్, పెయింట్‌ బ్రష్‌ను ఉపయోగిస్తూ 30 అడుగుల షారుక్‌ పోట్రాయిన్‌ రూపొందించాడు. ఈ స్టన్నింగ్‌ పోర్ట్రయిట్‌ డ్రోన్‌ షాట్‌ అదిరిపోయింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ మేకింగ్‌ వీడియో చూసిన నెటిజనులు ‘వావ్‌’ అంటున్నారు. ‘ట్రిబ్యూట్‌ టూ ది కింగ్‌ఖాన్‌. ఇది నా హృదయంలో నుంచి వచ్చిన కళారూపం. నా అభిమాన హీరో దీన్ని త్వరలోనే చూడాలనుకుంటున్నాను’ అంటూ రాశాడు బెనర్జీ.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top