జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి

Oct 5 2026 8:30 AM | Updated on Oct 5 2026 8:30 AM

గజ్వేల్‌రూరల్‌: జాతీయ ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఇండియా కూటమి నేతలు ఆముదాల మల్లారెడ్డిలు డిమాండ్‌ చేశారు. గజ్వేల్‌ పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ...రాజ్యాంగబద్ద సంస్థలైనటువంటి ఎన్నికల కమిషన్‌ బీజేపీకి అనుబంధంగా వ్యవహరిస్తుందన్నారు. జ్ఞానేశ్‌ కుమార్‌ ఏకపక్షంగా వ్యవహరించి ఓట్ల నమోదును తన గుప్పిట్లో పెట్టుకుని రాష్ట్రాల నుంచి వచ్చే అభ్యంతరాలపై స్పందించడం లేదని మండిపడ్డారు. పేదలను, మైనార్టీ, యువత, మహిళలను ఎన్నికలకు దూరం చేసే విధంగా కుట్ర దాగిఉందని, దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే జెన్‌జీ యువత ఉద్యమాలు చేస్తున్నారని, అక్టోబర్‌ 6న ఇండియా కూటమిలోని పార్టీల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ కార్యాలయం, 8న లోక్‌భవన్‌ ముట్టడి కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌, నాయకులు గోపాలస్వామి, శశిధర్‌, ఎల్లయ్య, రవికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement