వర్గల్(గజ్వేల్): మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుకు వర్గల్ శ్రీవిద్యాసరస్వతి శరన్నవరాత్రోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ ప్రతినిధులు ఆదివారం అందజేశారు. ఈ నెల 11 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
సౌర విద్యుత్‌తో
డబ్బులు ఆదా
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): నిత్యం మనకు అందుబాటులో ఉన్న సూర్యరశ్మితో మన ఇంటికి సరిపోయే విద్యుత్‌శక్తిని ఉత్పత్తి చేసుకునే అవకాశం సోలార్ విద్యుత్ వ్యవస్థతో అందుబాటులోకి వస్తుందని విద్యుత్‌శాఖ డివిజనల్ ఇంజనీర్ రామచంద్రయ్య పేర్కొన్నారు. సేవా సేతు అభియాన్ ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ఆదివారం జిల్లా కేంద్రంలో వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ రామచంద్రయ్య మాట్లాడుతూ..పీఏం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా అనేకమంది తమ గృహాల్లో రూప్‌టాప్‌పై సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. తమ గృహాల రూఫ్ టాప్‌పై సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుని ప్రతీ నెల 360 యూనిట్ల వరకు విద్యుత్‌ను పొందవచ్చన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ ఏడీఈ గంగాదర్, ఏఈ హుసేన్, వివిధ బ్యాంక్‌ల ప్రతినిధులు, వివిధ సోలార్ ప్లాంట్‌ల నిర్వహకులు, వినియోగదారులు పాల్గొన్నారు.
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి హరికృష్ణ
సిద్దిపేటరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో గ్రామాల సమగ్రాభివృద్ధి జరుగుతోందని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పూజల హరికృష్ణ పేర్కొన్నారు. సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని రాఘవపూర్ గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక నాయకులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మ శ్రీనివాస్, ఉప సర్పంచ్ వెంకటేశ్, వార్డు సభ్యులు తిరుపతి, సురేశ్, మల్లేశం, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ నాయకులు గరిపల్లి రాములు ప్రజలు పాల్గొన్నారు.
ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఈదురు వెంకన్న
హుస్నాబాద్: ఆర్టీసీ కార్మిక ఎన్నికలను రాజకీయాలకతీతంగా నిర్వహించాలని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న తెలిపారు. ఆదివారం డిపో యూనియన్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ఈ నెల 9న జరిగే ఎన్నికల్లో ఈయూ, టీఎంయూ, ఎన్‌ఎంయూ కూటమికి కార్మికులు మద్దతు ఇవ్వా లని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల పరిరక్షణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ల సాధనకు కూటమి పోరాడుతుందన్నారు. కరీంనగర్ రీజియన్‌లోని 11 డిపోల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కార్మికులు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.


