కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తుల రాకతో కిటకిటలాడింది. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. శనివారం సాయత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించారు. భక్తులకు కావల్సిన ఏర్పాట్లను ఆలయ ఈఓ సుధాకర్‌రెడ్డి, ఏఈఓ శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్‌లు పర్యవేక్షించారు.


