ఆరోగ్య భద్రతలో మేటి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య భద్రతలో మేటి

Oct 5 2026 8:30 AM | Updated on Oct 5 2026 8:30 AM

టీకాలలో ప్రగతి

సిద్దిపేటకమాన్‌: ఆరోగ్య భద్రత, గర్బిణులు, చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాల పంపిణీలో జిల్లా ప్రగతి సాధించింది. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల బీపీ, షుగర్‌, ఊబకాయం (అధిక బరువు) వంటి సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు. ఈ అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–6) తాజా నివేదికలో వెల్లడించింది. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే 6 (2023–24) ప్రకారం జిల్లాలో జనాభా, ఆరోగ్యం, పోషకాహారం, కుటుంబ సామాజిక, ఆర్థిక లక్షణాలు, మహిళ సాధికారిత, పిల్లల ఆరోగ్యం, ఇతర పలు రకాల విషయాలను ఈ నివేదికల్లో పేర్కొన్నారు.

మాతా శిశు సంరక్షణలోనూ..

టీకాల పంపిణీలోనూ..

సిద్దిపేట జిల్లాలో ఆస్పత్రి ప్రసవాలు 98.9% నమోదవ్వగా ఇందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 62.5%గా ఉంది. ప్రసవం తర్వాత రెండు రోజుల్లో తల్లికి సంరక్షణ 74.1% నుంచి 95.2శాతానికి..పిల్లలకు 85.9% నుంచి 94.6శాతానికి పెరిగింది. జిల్లాలో గర్భిణులు మొదటి మూడు నెలల్లో వైద్య పరీక్షలు చేయించుకునే వారు 86.1% నుంచి 95శాతానికి పెరిగింది. 180 రోజులు ఐరన్‌ మాత్రల వినియోగం 41.5% నుంచి 55.5శాతానికి పెరిగింది. జిల్లాలో సిజేరియన్‌ రెటు 69% నుంచి 63.4శాతానికి తగ్గినా ఇప్పటికీ అది చాలా ఎక్కువే. జిల్లాలో 12 నుంచి 23 నెలల పిల్లల్లో టీకాల పంపిణీ 81.5% నుంచి 94.9శాతానికి పెరిగింది. పోలియో చుక్కలు, మూడు డోసుల పెంటావాలెంట్‌, బీసీజీ, మీజిల్స్‌, రోటావైరస్‌, విటమిన్‌ ఏ పంపిణీలో జిల్లా ప్రగతి సాధించింది. ప్రభుత్వాస్పత్రుల్లో టీకాలు వేయించుకున్న వారు 97.9%గా ఉన్నారు.

మహిళా సాధికారతలో రికార్డు

జిల్లాలో సొంత బ్యాంకు ఖాతా ఉన్న మహిళలు 93.3%గా ఉన్నారు. సొంత మొబైల్‌ వినియోగించే మహిళలు 71.7%గా ఉన్నారు. నెలసరి సమయంలో శుభ్రమైన శానిటరీ ప్యాడ్లు వినియోగించే యువతులు 92.2% నుంచి 97.5శాతానికి పెరిగింది. బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 18 ఏళ్లలోపు పెళ్‌లైన మహిళలు 19% నుంచి 16శాతానికి తగ్గారు. ఆరోగ్య బీమా కవరేజీ 70.3% నుంచి 88.1శాతానికి పెరిగింది. ఇంటి స్థలం ఉన్న మహిళలు 24.4% నుంచి 34.8శాతానికి పెరిగారు. జిల్లాలో వైద్యారోగ్యశాఖ పనితీరు వల్ల గర్భిణులకు వైద్య సేవలు, చిన్న పిల్లలకు టీకాల పంపిణీలో పురోగతి సాధించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

షుగర్‌ వ్యాధి పెరుగుదల

జిల్లాలో ప్రతీ నలుగురిలో ఒకరు షుగర్‌ బారిన పడుతున్నారు. మహిళల్లో 141 నుంచి 160ఉన్న వారు 8.1% ఉండగా 160కంటే ఎక్కువ ఉన్నవారు 8.8% ఉండగా మొత్తం 18.6శాతం మంది షుగర్‌ ఉండి మందులు వాడుతున్నారు. పురుషుల్లో గతంలో 20% ఉండగా ప్రస్తుత నివేదికలు 24.4శాతం మందికి షుగర్‌ ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు. బీపీ విషయంలో కొంత మెరుగుదల కనిపించింది. గతంలో బీపీ ఉన్న మహిళలు 6.6% నుంచి 3.9శాతానికి, పురుషుల్లో 9.2% నుంచి 8.1శాతానికి తగ్గింది.

శిశు సంరక్షణ.. మహిళాసాధికారతలోనూ జిల్లా ముందంజే

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–6)లో వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement