ఆదివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

ఆదివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

100% సబ్సిడీతో బోర్‌ బావులు జిల్లావ్యాప్తంగా రెండు విడతల్లో 82 బోర్లు రెండున్నరేళ్లుగా మోటార్లు బిగించని ఎస్సీ కార్పొరేషన్‌ ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి దుబ్బాకకు చెందిన జనగామ శ్రీకాంత్‌. ఇటీవల ఇతడి తల్లిదండ్రులు చనిపోవడంతో కుటుంబ భారం శ్రీకాంత్‌ పడింది. 2.10 ఎకరాల భూమి ఉన్నా...బోరు బావి లేకపోవడంతో అది బీడు భూమి గానే ఉంది. అసలే కడు పేదరికంలో ఉన్న శ్రీకాంత్‌ తనకు రెండున్నరేళ్ల క్రితం బోర్‌ను ప్రభుత్వం డ్రిల్‌ చేసి వదిలేసిందని వాపోతున్నాడు. ప్రభుత్వం మోటార్‌ దించి కనెక్షన్‌ ఇస్తే వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు వ్యవసాయం తప్ప ఇతర ఏ పని రాదని ప్రభుత్వం సహకారం అందిస్తే బీడు భూమిని సాగు భూమిగా చేసి పంట పండించుకుంటానంటున్నాడు. బోరు వేసినప్పుడు నీళ్లు బాగా పడ్డాయని బోరు మోటార్‌కు వీలైనంత త్వరగా కనెక్షన్‌ ఇప్పించి ప్రభుత్వం తనకు సహాయం అందించాలని కోరుతున్నాడు.

సాక్షి, సిద్దిపేట: ఎస్సీ చిన్న, సన్నకారు రైతుల పంట పొలాలకు సాగునీటి సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం అజయ్‌ పథకం క్షేత్రస్థాయిలో అసంపూర్తిగా మిగిలింది. ఉచితంగా బోర్‌ బావులు తవ్వించి...వాటికి మోటార్లు బిగించకపోవడంతో రూ.లక్షల్లో ప్రజాధనం వెచ్చించినా రైతులకు ప్రయోజనం అందని పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా రెండు విడతల్లో 82 బోర్లు తవ్వి రెండున్నరేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క మోటారూ బిగించలేదు. బీడు భూములను సాగులోకి తీసుకురావాలని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

దళితుల భూములు బీడుగా మారకుండా ఉండేందుకు సాగునీటి సాయం అందించాలని లక్ష్యంతో పీఎం అజయ్‌ పథకంలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 100% సబ్సిడీతో బోర్‌ బావులు తవ్వించే కార్యక్రమాన్ని చేపట్టారు. మండలాల వారీగా ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరించగా 500మందికి పైగా దళిత రైతులు దరఖాస్తు చేశారు. భూగర్భ జలవనరుల శాఖ అధికారులు సర్వే చేసి అర్హత ఉన్న వారికి బోర్లను మంజూరు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement