ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కాజీపురం దర్శయ్య. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేటకు చెందినవాడు. రెండున్నరేళ్ల క్రితం ఎస్సీ కార్పొరేషన్ కింద ఇతనికి బోర్
మంజూరైంది. బోర్ మంజూరై ..డ్రిల్ చేసి రెండున్నరేళ్లు
గడుస్తున్నా...మోటార్ ఇవ్వక, కరెంట్ కనెక్షన్ లేకపోవడంతో..సాగు చేయక బీడు భూమిగా ఉంది. అసలే రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు. ప్రభుత్వం మోటార్ మంజూరు చేస్తే భూమి సాగు చేసుకుంటే... జీవనోపాధి దొరుకుతుందని
బాధితుడు వాపోతున్నాడు.


