ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనుల పరిశీలన

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

హుస్నాబాద్‌: ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను శనివారం రాత్రి ఒకటవ అదనపు జిల్లా జడ్జి జయప్రసాద్‌ వీక్షించారు. హుస్నాబాద్‌ చెరువులో కొత్తగా నిర్మించిన గ్లాస్‌ బ్రిడ్జి అందాలు ఇన్‌స్ట్రాగామ్‌, ఫేస్‌బుక్‌లో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెరువు కట్ట సుందరీకరణ పనులు, గ్లాస్‌ బ్రిడ్జిని జడ్జి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన వెంట హుస్నాబాద్‌ జడ్జి ప్రమీద, మాజీ ఏజీపీ చిత్తారి రవీందర్‌, ఎస్సై లక్ష్మారెడ్డి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement