ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదు

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

● డైవర్షన్‌ రాజకీయాలతో కాలయాపన ● ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి

● డైవర్షన్‌ రాజకీయాలతో కాలయాపన ● ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్‌: డైవర్షన్‌ రాజకీయాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాలయాపన చేస్తున్నారే తప్పా...ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటూ మంథని నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేపట్టిన బెన్నీపాల్‌, వెంకటేశ్‌, కె.వెంకటేశ్‌లు శనివారం గజ్వేల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతాప్‌రెడ్డి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధాలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి పాలనలో విఫలమై ప్రజలకు నరకం చూపుతున్నారన్నారు. గోదావరి జలాలు వృథాగా పోతున్నా ప్రభుత్వానికి కనీసం పట్టింపులేదని మండిపడ్డారు. కరెంట్‌ కోతల వల్ల వ్యవసాయానికి గడ్డు రోజులు సంక్రమించాయని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలను అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సీఎం వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలు తిరిగి కేసీఆర్‌ పాలన కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ మంథని నియోజకవర్గానికి చెందిన నేతలు పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement