ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయినట్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయు లు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి క్రీడల్లో రాణించిన విద్యార్థులను శనివారం స్థానిక పాఠశాలలో అభినందించా రు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. 70వ ఎస్‌జీఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి క్రీడల్లో పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు రాణించారన్నారు. ఫుట్‌బాల్ అండర్ 17 విభాగంలో వర్షిత్, అండర్ 14 విభా గంలో ఆధ్యాన్, హ్యాండ్ బాల్‌లో అండర్ 17 బాలికల విభాగంలో అర్చన, అండర్ 14 బాలి కల విభాగంలో హర్ష ప్రియా, నక్షత్ర, బాలుర విభాగంలో శరత్, తైక్వాండోలో అభిలాష్, ఖ.రిషిక్ వర్మ, నవ్య రాణించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. కార్యక్రమంలో పాఠశాల పీడీ సంతోషి, ఉపాధ్యాయులు ఉన్నారు.
రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి
గజ్వేల్: ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి పేర్కొన్నా రు. గజ్వేల్‌లోని రైతు వేదికలో మిషన్ ఫర్ ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్(ఎంఏఎన్‌పీ) కార్య క్రమంలో భాగంగా రాయితీపై శనగ విత్తనాల ను పంపిణీ చేశారు. గజ్వేల్ మంలానికి 100% సబ్సిడీ కింద 16కిలోల 50 చిరు సంచులను, మరో 9.92క్వింటాళ్ల విత్తనాలను 70% రాయి తీపై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. శనగ సాగు అధికంగా ఉండే గజ్వేల్, జగదేవ్‌పూర్, బెజ్జంకి, చేర్యాల మండలాల్లో ఈ సబ్సిడీ విత్తనాలను అందిస్తున్నట్లు చెప్పారు. జాతీయ నూనె గింజల మిషన్‌లో భాగంగా జిల్లాలోని పది మండలాలకు 3,000 ఎకరాలకు 100% సబ్సిడీపై పొద్దుతిరుగుడు విత్తనాలు అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏడీఏ బాబునాయక్, వ్యవసాయాధికారి నాగరాజు, కాంగ్రెస్ నాయకులు సర్ధార్‌ఖాన్, సుఖేందర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, ఏఈఓలు పాల్గొన్నారు.
7 వరకు
అభ్యంతరాల స్వీకరణ
జిల్లా సహకార శాఖ అధికారి నాగేశ్వర్‌రావు
సిద్దిపేటరూరల్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సిద్దిపేట బ్రాంచ్ ఓటర్ల జాబితాకు సంబంధించిన అభ్యంతరాలను ఈ నెల 07వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు జిల్లా సహకారశాఖ అధికా రి నాగేశ్వర్‌రావు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు ఓటర్ల పరిశీలనార్థం సిద్దిపేటరూరల్, సిద్దిపేటఅర్బన్, సిద్దిపేట మున్సిపాలిటీ, ఆర్డీఓ కార్యాలయం, జిల్లా పరిషత్‌కార్యాలయం, కలెక్టరేట్‌లోని నోటీస్‌బోర్డులో ఓటర్ల ముసాయిదా ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. వీటికి సంబంధించిన అభ్యంతరాలను ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు జిల్లా సహకార శాఖ అధికారికి తెలపాలన్నారు.
పేద విద్యార్థికి
ల్యాప్‌టాప్ అందజేత
సిద్దిపేటజోన్: ఇంజినీరింగ్ చదువుతున్న పేద విద్యార్థికి మాజీ మంత్రి హరీశ్‌రావు ల్యాప్‌టాప్ అందించారు. హైదరా బాద్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ కోర్సు చేస్తున్న వైష్ణవి ఆర్థిక పరిస్థితి గమనించిన బీఆర్‌ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు రెడ్డి ప్రభాకర్‌రెడ్డి ల్యాప్ ట్యాప్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు చేతుల మీద అందించారు.


