అధికారుల బాధ్యత కీలకం అధికారుల బాధ్యత చాలా కీలకమైందని సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌గౌడ్‌ అన్నారు. వివరాలు 9లో u | - | Sakshi
Sakshi News home page

అధికారుల బాధ్యత కీలకం అధికారుల బాధ్యత చాలా కీలకమైందని సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌గౌడ్‌ అన్నారు. వివరాలు 9లో u

Jun 10 2026 7:38 AM | Updated on Jun 10 2026 7:38 AM

అధికారుల బాధ్యత కీలకం అధికారుల బాధ్యత చాలా కీలకమైందని సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌గౌడ్‌ అన్నారు. వివరాలు 9లో u

అధిక కేసులు

పరిష్కరిద్దాం

లోక్‌ అదాలత్‌లో

కక్షిదారులు రాజీపడేటట్లు చూడాలి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి

సాయిరమాదేవి

సిద్దిపేటకమాన్‌: జిల్లాలో క్రిమినల్‌, సివిల్‌, ఎక్సైజ్‌, మోటారు వాహనాల కేసులు అధిక మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయని.. ఈ నెల 20న జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో అధిక మొత్తంలో రాజీపడేటట్లు చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు భవనంలో న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో ప్రధాన న్యాయమూర్తి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సివిల్‌, క్రిమినల్‌ కేసులను పూర్తిగా పరిష్కరించాలన్నారు. లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారంలో వేగం పెంచి రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉండే విధంగా న్యాయ, పోలీసు అధికారులు పనిచేయాలని ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పెండింగ్‌ కేసులు త్వరగా పరిష్కారమయ్యే విధంగా పనిచేయాలన్నారు. కక్షిదారులు సైతం ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో న్యాయమూర్తులు జయప్రసాద్‌, సంతోష్‌కుమార్‌, కుమారస్వామి, సాధన, తరణి, సౌజన్య, కాంతరావు, ఏసీపీలు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement