వినియోగదారుల సౌలభ్యానికే ప్రాధాన్యం
బెజ్జంకి(సిద్దిపేట): విద్యుత్ వినియోగదారుల సౌలభ్యానికి ప్రాధాన్యతనిస్తూ అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌పీడీసీఎల్ సిద్దిపేట విజిలెన్స్ ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి అన్నారు. విజిలెన్స్ ఆవగాహన వారోత్సవాల సంర్భంగా మండలంలోని రామసాగరంలో ఆదివారం అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కృష్ణతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఎవరైనా లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.


