పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరండి
చేర్యాల(సిద్దిపేట): పట్టుదలతో బాగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని కలెక్టర్ హైమావతి విద్యార్థినులకు సూచించారు. పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆదివారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, వంట సరుకులు సక్రమంగా అందిస్తున్నారా? లేదా? అని ఆరా తీశారు. రిజిస్టర్లు చెక్ చేస్తూ స్టాక్ రిజిస్టర్ సక్రమంగా మెయింటేన్ చేయాలని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ పాటించకుండా కూరగాయాలు దొరకడంలేదని సాకులు చెబితే ఉపేక్షంచేది లేదని వంట సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం విద్యారినులతో మాట్లాడుతూ కడుపునిండా తిని బాగా చదువుకోవాలని సూచించారు. చదువు విషయంలో రాజీ పడవద్దని లక్ష్యాన్ని ఎంచుకోని నిరంతరం శ్రమించాలని విద్యార్థులకు తెలిపారు.
కలెక్టర్ హైమావతి
కేజీబీవీ సందర్శన


