సత్వర పరిష్కారం చూపండి | - | Sakshi
Sakshi News home page

సత్వర పరిష్కారం చూపండి

Oct 13 2026 11:43 AM | Updated on Oct 13 2026 11:43 AM

సత్వర పరిష్కారం చూపండి సమస్యల పరిష్కారానికే ప్రజావాణి: ఎస్పీ సింగూరు నుంచి దిగువకు నీరు ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల్లో ఒకరు డిబార్‌

అదనపు కలెక్టర్లు సంగీత, పాండు

సంగారెడ్డి జోన్‌: ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు సంగీత, పాండు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీలను స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 69 అర్జీలు అందినట్లు తెలిపారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, వెంటనే ఆన్‌లైన్‌్‌లో నమోదు చేయడంతో పాటు పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సంగారెడ్డి 15, నారాయణఖేడ్‌ 2, జహీరాబాద్‌లో 2 అర్జీలు అందగా, కలెక్టరేట్‌లో 50 అర్జీలు స్వీకరించారు. అందోల్‌ డివిజన్‌ నుంచి ఎలాంటి వినతులు రాలేదు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి, హౌసింగ్‌ పీడీ చలపతిరావు, అదనపు డీఆర్డీఓ బాలరాజ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రామాచారి, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ తుల్జా నాయక్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అడ్వకేట్‌ గౌతమి, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఈఈ ఎస్‌కె పాషా, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జోన్‌: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ తెలిపారు. సోమవారం ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత పోలీస్‌ అధికారులతో ఫోన్‌్‌లో మాట్లాడారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ సూచించారు. ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి చట్టపరమైన పరిష్కారం పొందేందుకు ప్రజావాణి వేదికగా నిలుస్తుందన్నారు.

పుల్‌కల్‌(అందోల్‌): సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజ్‌లోకి దిగువకు సోమవారం నీటిని విడుదల చేశారు. 5, 6 గేట్లను మీటరు ఎత్తు ఎత్తి 0.15 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. మంజీరా బ్యారేజ్‌ నుంచి జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేస్తారు. ప్రాజెక్టులో నీరు అడుగంటడంతో సింగూరు నుంచి నీటిని వదిలారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 3.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నీటిని జంటనగరాల తాగునీటికి, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మిషన్‌ భగీరథ తాగునీటికి సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. మంజీరా నుంచి ఫిల్టర్‌ బెడ్‌ ద్వారా జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేస్తారు.

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షలు సోమ వారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్షల్లో పదో తరగతి అభ్యాసకులకు తెలుగు, ఇంటర్మీడియెట్‌ అభ్యాసకులకు తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలు నిర్వహించారు. మధ్యాహ్నం ఇంటర్మీడియెట్‌ అభ్యాసకులకు అరబిక్‌ పరీక్ష జరిగింది. ఉదయం జరిగిన పదో తరగతి తెలుగు పరీక్షకు 36 మంది అభ్యాసకులకు గాను 25 మంది హాజరుకాగా, 11 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు 182 మందికి గాను 132 మంది హాజరుకాగా, 50 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ఇంటర్మీడియెట్‌ అరబిక్‌ పరీక్షకు ఐదుగురికి గాను ఒక్కరు మాత్రమే హాజరుకాగా, నలుగురు గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి సంగారెడ్డిలోని బాలుర, బాలికల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఈసందర్భంగా ఇంటర్మీడియెట్‌ పరీక్ష కేంద్రంలో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఒక అభ్యర్థిని అధికారులు డిబార్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement