సబ్ కలెక్టర్ ఉమాహారతి
నారాయణఖేడ్: రానున్న నీటి కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతీ ఒక్కరూ తమ ఇంటి సమీపంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఉమాహారతి సూచించారు. మండలంలోని జగన్నాథ్‌పూర్‌లో సోమవారం జల సిరి పథకం కింద చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎల్‌ని నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున నీటి సంరక్షణకు ప్రతీ ఒక్కరూ ప్రాధాన్యమివ్వాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రామ్ జీ పథకం ద్వారా రైతులు, కూలీలకు ఉపయోగపడే పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన ఆమె.. అర్హులైన కూలీలందరూ ఉపాధి పనులను వినియోగించుకోవాలని సూచించారు. కూలీలకు ప్రతీ రోజూ ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయ్, పంచా యతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, సహాయకులు శ్రీనివాస్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.


