డీఆర్‌డీఏ పీడీ జయదేవ్
ములుగు(గజ్వేల్): ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న ఫాం పాండ్స్ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని డీఆర్‌డీఏ పీడీ జయదేవ్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని జప్తిసింగాయిపల్లిలో కొనసాగుతున్న ఫాంపాండ్స్ నిర్మాణాలు, ఉపాధిహామీ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి కొరతను అధిగమించడానికి, భూగర్భ జలాలను పెంపొందించడానికి ఫాం పాండ్స్ ఎంతగానో దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, డీటీసీ నరేశ్‌చారి, ఎపీఓ శైలజ, ఐకెపీ ఏపీఎం ఆనంద్, పంచాయతీ కార్యదర్శి దీప్తి తదితరులు పాల్గొన్నారు.


