నర్సాపూర్ రూరల్: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం ప క్రారం.. మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని గుర్జ్య తండాకు చెందిన వాక్డోత్ గోపాల్ నాయక్ (31) ఈనెల 3న ఉదయం పొలం వద్దకు వెళ్తున్నట్లు చెప్పాడు. అదే రోజు పొలం వద్ద పురుగుల మందు తాగాడు. అటుగా వెళ్తున్న వారికి గోపాల్ నాయక్ స్పృహ కోల్పోయి కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా అతడ్ని ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా అతడు కొంతకాలంగా తాగుడుకు బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు.


