పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు

Oct 6 2026 8:31 AM | Updated on Oct 6 2026 8:31 AM

కొండాపూర్‌ (సంగారెడ్డి): విధులకు డుమ్మా కొట్టి.. రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నారనే శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఎంపీడీఓ వెంటనే స్పందించారు. ఈ మేరకు శనివారం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన కార్యదర్శులు 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. కార్యాలయాల్లో కార్యదర్శులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విధులకు హాజరయ్యే కార్యదర్శులు తప్పనిసరిగా ఆయా పంచాయతీ పరిధిలోనే నివాసం ఉండాలని, ఎలాంటి అనుమతి లేకుండా గైర్హాజరు కావద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement