చివరికి కంటతడి | - | Sakshi
Sakshi News home page

చివరికి కంటతడి

Oct 6 2026 8:31 AM | Updated on Oct 6 2026 8:31 AM

న్యూస్‌రీల్‌

రైతులను వెంటాడుతున్న కరెంట్‌ కష్టాలు

మంగళవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అన్నదాతలకు కరెంట్‌ కష్టాలు తీవ్ర మవుతున్నాయి. పంట చేతికందే దశలో విద్యుత్‌ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. త్రీఫేజ్‌ సరఫరా 6 నుంచి 7 గంటలకు మించి రావడం లేదు. దీనికి తోడు తరచూ ట్రిప్‌ అవుతోంది. మరోవైపు లో ఓల్టేజీ కారణంగా మోటార్లు కాలిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్షం రోజుల్లో వరి కోతకు వస్తుంది. ఇలాంటి కీలక దశలో కరెంట్‌ కోతల కారణంగా సాగునీరు అందకపోవడంతో కండ్ల ముందే పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1.22 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ప్రధానంగా నారాయణఖేడ్‌, కల్హేర్‌, కంగ్టి, నిజాంపేట, ఆందోల్‌, జిన్నారం, గుమ్మడిదల, హత్నూర తదితర మండలాల్లో వరి పండిస్తున్నారు. ఇప్పుడు వరికి చివరి తడి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షాలు కురియలేదు. వేసవి మాదిరిగా ఎండలు మండిపోతున్నాయి. భూగర్భజలాలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో బోర్లు ఎక్కువ సమయం నడపాల్సి వస్తోంది. ఈ క్రమంలో విద్యుత్‌ సరఫరా సరిగ్గా లేకపోవడంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

సబ్‌స్టేషన్ల ముట్టడి..

కరెంట్‌ కష్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఆదివారం కల్హేర్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు కరెంట్‌ కోతల కారణంగా చేతికందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హత్నూర మండలం నస్తీపూర్‌ సబ్‌స్టేషన్‌ వద్ద మంగాపూర్‌ రైతులు ఆందోళనకు దిగారు. తరచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని, లోఓల్టేజీతో మొటార్లు కాలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవర్‌లోడ్‌.. 785 మెగావాట్లు

జిల్లాలో 1.02 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఎండల తీవ్రత కారణంగా బోర్లతో పాటు, గృహ విద్యుత్‌ వినియోగం పెరగడంతో గ్రిడ్‌పై విపరీతమైన లోడ్‌ పడుతోందని విద్యుత్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 4న (ఆదివారం) గరిష్టంగా 785 మోగావాట్ల లోడ్‌ పడిందని ఆశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా నారాయణఖేడ్‌ ప్రాంతంలోని తడ్కల్‌ సబ్‌ స్టేషన్‌ జంగీ ఫీడర్‌ విద్యుత్‌ లోడ్‌ 195 ఏఎంపీకు పెరిగింది. అలాగే హన్మంతరావుపేట, బాచేపల్లి ఫీడర్‌లలో 180 ఏఎంపీఎస్‌కు చేరిందని ఆశాఖ పేర్కోంటోంది. మరోవైపు హత్నూర సబ్‌స్టేషన్‌ నవాబ్‌పేట ఫీడర్‌పై 161 ఏఎంపీఎస్‌కు పెరిగిందని చెబుతున్నారు.

ఎండిపోతున్న పంటలు

లో ఓల్టేజీతో కాలిపోతున్న మోటార్లు

పంట చేతికందే దశలో తిప్పలు

విద్యుత్‌లోడ్‌ 785 మెగావాట్లకు పెరిగిందంటున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement