సంగారెడ్డి జోన్: ప్రజాసమస్యపై నేరుగా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుంది. గతంలో కలెక్టరేట్‌కు మాత్రమే పరిమితమైన ఈ కార్యక్రమం డివిజన్ స్థాయితో పాటు తాజాగా మండల స్థాయిలోనూ నిర్వహిస్తోంది. ఎక్కడికక్కడ ఫిర్యాదుల స్వీకరణ ఉన్నప్పటికీ జిల్లా కేంద్రానికి మాత్రం బారులు తీరటం తప్పడం లేదు.
మండల కేంద్రాల్లో కనిపించని స్పందన
ప్రజలకు దూరభారంతో పాటు సమయం ఆదా చేస్తూ రవాణ ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో ఫిర్యాదుల స్వీకరణ చేపట్టింది. అయినప్పటికీ ప్రజల్లో స్పందన కనిపించడం లేదు. గ్రామ, మండల స్థాయిలో నెలకొన్న సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారానికి నోచుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. ఫిర్యాదుల రూపంలో మండల అధికారులకు తమ గోడు వెల్లబోసుకునన్నా పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. స్థానికంగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే జిల్లా అధికారులకు ఆశ్రయిస్తున్నామని చెబుతున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 108 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో పాటు అదనపు కలెక్టర్లు సంగీత, పాండు తదితర శాఖల అధికారులు హాజరై వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
భూదాన్ భూములకు రక్షణ కల్పించాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూదాన్ భూములను సమగ్రంగా రీ–సర్వే చేసి, డిజిటలైజేషన్ చేయడంతో పాటు ఆక్రమణలు, అక్రమ లావాదేవీలను అరికట్టాలని తెలంగాణ సర్వోదయ మండల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతి ప్రతం అందించారు.
జిల్లాలో వినతుల వివరాలు కలెక్టరేట్ 53 సంగారెడ్డి డివిజన్ 22 నారాయణఖేడ్ 5 జహీరాబాద్ 1 అందోల్ 0 మండలాల్లో 27
కలెక్టరేట్‌కు తగ్గని రద్దీ
జిల్లాస్థాయిలోనూ బారులు
స్థానికంగా పరిష్కారం కానీ సమస్యలు


