జిల్లాలో ఇలా.. మున్సిపాలిటీ నివాసాల సంఖ్య సంగారెడ్డి 26,938 జహీరాబాద్‌ 23,482 ఇస్నాపూర్‌ 13,275 సదాశివపేట 12,408 ఇంద్రేశం 8,581 గుమ్మడిదల 6,054 జోగిపేట్‌– ఆందోల్‌ 5,220 నారాయణఖేడ్‌ 4,681 కోహీర్‌ 4,416 గడ్డపోతారం 3,919 జిన్నారం 3,364 | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఇలా.. మున్సిపాలిటీ నివాసాల సంఖ్య సంగారెడ్డి 26,938 జహీరాబాద్‌ 23,482 ఇస్నాపూర్‌ 13,275 సదాశివపేట 12,408 ఇంద్రేశం 8,581 గుమ్మడిదల 6,054 జోగిపేట్‌– ఆందోల్‌ 5,220 నారాయణఖేడ్‌ 4,681 కోహీర్‌ 4,416 గడ్డపోతారం 3,919 జిన్నారం 3,364

Oct 6 2026 8:31 AM | Updated on Oct 6 2026 8:31 AM

మున్సిపాలిటీల్లోని ఇళ్లు, భవనాలు, వ్యాపార సముదాయాలను జియో స్పేషియల్‌ టెక్నాలజీ, డిజిటల్‌ మ్యాపింగ్‌ ఆధారంగా గుర్తించి వాటి వివరాలను భువన్‌ యాప్‌లో అధికారులు నమోదు చేస్తారు. ఇంటి స్థానం, నిర్మాణ విస్తీర్ణం, వినియోగం తదితర వివరాలను రికార్డు చేస్తారు. ఈ సర్వేతో ఖచ్చితమైన డిజిటల్‌ రికార్డులు అందుబాటులోకి రానున్నాయి. ఆస్తి పన్ను రికార్డుల్లో ఉన్న లోపాలు, వ్యత్యాసాలను గుర్తించే అవకాశం ఉంది. పన్ను పరిధిలోకి రాని భవనాలను గుర్తించనున్నారు. మున్సిపల్‌ సేవలు, పట్టణ ప్రణాళిక మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను ఈ భువన్‌ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ద్వారా రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల ప్రణాళికకు డేటా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 5 పాత, 6 కొత్త మున్సిపాలిటీలు కలిపి మొత్తం 11 మున్సిపాలిటీల్లో సర్వే చేసి భువన్‌ యాప్‌లో నమోదు చేసేందుకు అధికారులు ఇళ్ల కొలతల నమోదు ప్రక్రియ చేపడుతున్నారు.

పన్నుల పెరుగుదలపై ఆందోళన

గతంలో ఉన్న పన్నుల కంటే భువన్‌ యాప్‌లో నమోదు తర్వాత ఇంటి పన్నులు పెరిగాయన్న ఆందోళన ఇళ్ల యజమానుల నుంచి వ్యక్తమైంది. వేలాది రూపాయిల ఇళ్ల ట్యాక్సుల మదింపు జరగడంతో ఆందోళన చెందారు. తాజాగా మళ్లీ ఇళ్ల కొలతలు తీస్తుండడంతో ఇంటి యజమానుల గుండెలు గు‘బిళ్లు’ మంటున్నాయి.

నమోదుతో కచ్చితత్వం

భువన్‌ యాప్‌లో కొలతలు తీసి నమోదు చేయడం వల్ల ఇళ్ల వివరాల ఖచ్చితత్వం వస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలో నమోదు చేసిన విషయాల్లో ఏమైనా లోపాలు ఉన్నా, అధికారులు సక్రమంగా నమోదు చేయని విషయాలు ఉన్నా బయట పడే అవకాశం ఉంది. రెండేళ్ల తర్వాత ఎవరైనా ఇళ్ల యజమానులు అనుమతి లేకుండా అంతస్తులు పెంచి నిర్మించడం, భవనాల విస్తీర్ణం పెంచడం లాంటివి చేస్తే ప్రస్తుత సర్వేలో ఆ అంశాలు వెలుగు చూడనున్నాయి. తద్వారా ఖచ్చితత్వంతో వివరాలు నమోదై ట్యాక్స్‌ పెరిగి ప్రభుత్వానికి ఆదాయం సకమకూరనుంది. అదే సమయంలో అధికారులు తప్పుగా విస్తీర్ణం పెంచి నమోదు చేస్తే పన్ను లెక్కింపుపై భారీ ప్రభావం పడనుందని ఇళ్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇంటి పన్ను మదింపు

కచ్చితమైన వివరాల నమోదు

పన్నుల భారం పెరుగుతుందని ప్రజల్లో ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement