హత్నూర(సంగారెడ్డి): వీఓఏలపై అధికారుల వేధింపులు ఆపకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నగేశ్ అన్నారు. సోమవారం హత్నూర ఐకేపీ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హత్నూర మండలం కాసాల వీఓఏపై సీసీ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. 24 ఏళ్లుగా కష్టపడుతున్న వీఓఏలకు నేటికీ కనీస వేతనం లేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత, చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలని కోరారు. నల్గొండ జిల్లాలో మాధవిపై అన్యాయంగా దాడి చేసిన మాజీ సర్పంచ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏపీఎం రాజశేఖర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సా యిలు, యూనియన్ నాయకులు మంజుల, ఆంజనేయులు, కిష్టయ్య, లక్ష్మయ్య, నరేందర్ గౌడ్, కృష్ణ, భాగ్యలక్ష్మి, మల్లయ్య, ప్రవీణ్, మల్లారెడ్డి, విజయ తదితరులు పాల్గొన్నారు.
వీఓఏ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నగేశ్


