విద్యుత్‌ కోతలపై కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కోతలపై కన్నెర్ర

Oct 6 2026 8:31 AM | Updated on Oct 6 2026 8:31 AM

గణేశ్‌ గడ్డ హుండీ ఆదాయం రూ.36 లక్షలు నేటి నుంచి సమాచార వారోత్సవాలు అధికారులున్నా.. అర్జీలు సున్నా జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాల్సిందే

హత్నూర(సంగారెడ్డి): విద్యుత్‌ కోతలతో వరి పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన మండలంలోని మంగాపూర్‌ రైతులు నస్తీపూర్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంట్‌ సక్రమంగా ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. లో ఓల్టేజీతో బోర్‌ మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

పటాన్‌చెరు టౌన్‌: ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గణేశ్‌ గడ్డ ఆలయ హుండీని సోమవారం దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ రంగారావు, ఈఓ లావణ్య సమక్షంలో లెక్కించారు. 102 రోజులకు గాను రూ.36 లక్షల 28 వేలు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన ఆదా యా న్ని దేవాలయ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు సమకూరుస్తామన్నారు. కార్యక్రమంలో అర్చకులు సంతోష్‌ జోషి, చంద్రశేఖర్‌ స్వామి, జగదీశ్వర్‌ స్వామి, అయ్యప్ప, సతీశ్‌ పాల్గొన్నారు.

సంగారెడ్డి జోన్‌: సమాచార హక్కు చట్టం వారోత్సవాలు సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ సంగీత అధికారులను సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. రాష్ట్ర సమాచార కమిషన్‌ కార్యదర్శి ఆదేశాల మేరకు మంగళవారం నుంచి ఈనెల 12 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నిర్వహించాల్సిన బాధ్యతలపై చైతన్యం కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈనెల 9న రాష్ట్రస్థాయిలో నిర్వహించే కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు జిల్లా కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

సంగారెడ్డి: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అందుబాటులో ఉన్నా.. అర్జీలు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం చౌటకూర్‌ మండల ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో కే.శంకర్‌, తహసీల్దార్‌ అనుదీప్‌, విద్యుత్‌ ఏఈ సాయి రాఘవ, పశువైద్యాధికారి డాక్టర్‌ విశాల్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అమతవాణి, ఉద్యానవన శాఖ అధికారి సంగయ్య, హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారి రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఒక్క అర్జీ కూడా అందకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని ఎంపీడీఓ శంకర్‌ సూచించారు.

మెదక్‌ కలెక్టరేట్‌: ఓటుచోరికి బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇండియా కూటమి నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జ్ఞానేశ్‌ కుమార్‌ నిర్ణయంతో సర్‌ ప్రక్రియ ద్వారా దేశంలో లక్షలాది ఓట్లు తొలగించే కుట్ర జరుగుతుందన్నారు. దీనిని నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక, వైస్‌ చైర్మన్‌ నరేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement