ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): అభ్యుదయ రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ (అరసం) మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్టు, పెదపరిమి సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీల్లో జిల్లాకు చెందిన పర్కపెల్లి యాదగిరి రచించిన ‘‘బతుకుసాక’’ కథకు ద్వితీయ బహుమతి లభించింది. ఈ విషయాన్ని వెన్నెల సాహితీ సంగమం జిల్లా అఽధ్యక్షుడు కొండి మల్లారెడ్డి ఆదివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఈ నెల 23, 24తేదీల్లో జరగబోయే అరసం సభలలో బహుమతి అందుకోనున్నారని పేర్కొన్నారు. పర్కపెల్లి యాదగిరి వెన్నెల సాహితీ సంగమం సిద్దిపేట ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. ఆయన కథకు బహుమతి రావడంపై జిల్లా కవులు వంగర నరసింహారెడ్డి, జీడిపల్లి రాంచందర్ రావు, వంగా గాలిరెడ్డి, రాజు, అశోక్ రాజు, మహమూద్ పాషా, మహేందర్ రెడ్డి, మోహన్, త్రివిక్రమ శర్మ, మహిపాల్, ఉమాశంకర్, యేసురాజు, మహేందర్, రాజు అభినందించారు.


