క్రీడల్లో నైపుణ్యం సాధించాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో నైపుణ్యం సాధించాలి

May 4 2026 10:31 AM | Updated on May 4 2026 10:31 AM

● వాలీబాల్‌ శిక్షణ శిబిరం ప్రారంభం

● వాలీబాల్‌ శిక్షణ శిబిరం ప్రారంభం

కౌడిపల్లి(నర్సాపూర్‌): క్రీడల్లో నైపుణ్యం సాధించా లని పలువురు పేర్కొన్నారు. ప్రభుత్వం, యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో వేసవి ప్రత్యేక శిబిరాల ను ఏర్పాటు చేస్తుంది. ఆదివారం మండల కేంద్రమైన కౌడిపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్‌ శిక్షణ శిబిరాన్ని ఉపసర్పంచ్‌ శ్వేత ప్రారంభించారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు నిర్వహించే శిక్షణలో 14 ఏళ్లలోపు పిల్లలు పాల్గొని క్రీడానైపుణ్యం పొందాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు భూమయ్య పటేల్‌, దేవేందర్‌, నాగరాజు, వీరేశంగౌడ్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement