రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి

Apr 18 2026 8:17 AM | Updated on Apr 18 2026 8:17 AM

రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి

కేవీకే భూసార నిపుణుడు

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని జహీరాబాద్‌ కేవీకే భూసార నిపుణులు స్వామి అన్నారు. మండల పరిధిలోని మల్గి, రత్నాపూర్‌, మెరియంపూర్‌ గ్రామాల్లో భూసార పరీక్షల వల్ల కలిగే ప్రయోజనాలపై శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రసాయన ఎరువుల వాడకం వల్ల తాత్కాలికంగా కొంత మేర దిగుబడులు పెరిగినా అనంతరం నష్టాలను చూడవలసి వస్తుందన్నారు. రైతులు భూసార పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని, దీని వల్ల నేలల్లో లోపించిన పోషకాలను తెలుసుకోవచ్చని చెప్పారు. పంట మార్పిడి చేసుకోవాలని శాస్త్రవేత్త రమేశ్‌ రైతులకు సూచించారు. సేంద్రియ ఎరువులు తయారు చేసే విధానాన్ని వివరించారు. అనంతరం మట్టి పరీక్షలకు సంబంధించిన ఫలితాలను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు అమీనా , పవిత్ర, నాగేశ్వరి, డీడీఎస్‌ సూపర్‌వైజర్‌ వినయ్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement