అంగన్‌వాడీలకు కొత్త సెల్‌ఫోన్లు | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు కొత్త సెల్‌ఫోన్లు

Apr 8 2026 8:08 AM | Updated on Apr 8 2026 8:08 AM

అంగన్‌వాడీలకు కొత్త సెల్‌ఫోన్లు ● పోషణ్‌ట్రాకర్‌, ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌ల నిర్వహణ కోసం ● గతంలో ఇచ్చిన ఫోన్లలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు ● ఈసారి 4 జీబీ ర్యామ్‌ సామర్థ్యం ఉన్న మొబైల్స్‌ ఇక వివరాలన్నీ యాప్‌లలోనే..

● పోషణ్‌ట్రాకర్‌, ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌ల నిర్వహణ కోసం ● గతంలో ఇచ్చిన ఫోన్లలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు ● ఈసారి 4 జీబీ ర్యామ్‌ సామర్థ్యం ఉన్న మొబైల్స్‌
ర్యామ్‌ సామర్థ్యం..

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒక్కో అంగన్‌వాడీ కార్యకర్తకు ఒకటి చొప్పున ఈ సెల్‌ఫోన్లను పంపిణీ చేస్తున్నారు. అలాగే అంగన్‌వాడీలను పర్యవేక్షించే సూపర్‌వైజర్లు, ఆ పైఅధికారులకు కూడా వీటిని ఇస్తున్నారు. గతంలో శాంసంగ్‌ కంపెనీకి చెందిన సెల్‌ఫోన్లను పంపిణీ చేయగా..ఈసారి కూడా ఇదే కంపెనీకి చెందిన మొబైల్స్‌ ఇస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రానికి చేరుకున్న ఈ మొబైల్‌ ఫోన్లను ఆయా ప్రాజెక్టులకు పంపుతున్నారు. అయితే అంగన్‌వాడీ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాలకు వీటిని పంపిణీ చేయడం లేదు. జిల్లాలో ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, జోగిపేట, సదాశివపేట, పటాన్‌చెరు ఐడీసీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,504 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిల్లో 1,464 అంగన్‌వాడీ టీచర్లు పని చేస్తున్నారు.

జిల్లాలోని సుమారు 1.05 లక్షల మంది చిన్నారులు నిత్యం ఈ అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. సుమారు 12 వేల మంది గర్భిణీలు, పది వేల వరకు బాలింతలకు కూడా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు. రైస్‌, దాల్‌, గ్రీన్‌ వెజిటెబుల్స్‌, ఉడకబెట్టిన కోడిగుడ్లు, పాలు వంటి ఆహారాన్ని అందిస్తున్నారు. అలాగే సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలై ఆరోగ్యలక్ష్మి, పోషణ్‌ అభియాన్‌ వంటి పథకాలు కూడా అమలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పోషన్‌ ట్రాకర్‌యాప్‌తోపాటు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌లలో అంగన్‌వాడీ టీచర్లు నిత్యం వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అంగన్‌వాడీ కేంద్రాలు తెరిచే సమయం, మూసే సమయం, చిన్నారుల హాజరు, ఇతర సమాచారాన్ని ప్రతిరోజు నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే లబ్ధిదారులు ఫేస్‌ రికగ్నైజేషన్‌ వంటి ప్రక్రియ అంతా ఈ యాప్‌లలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాల నమోదుకు ప్రభుత్వం సెల్‌ఫోన్లను పంపిణీ చేస్తోంది.

గతంలో అంగన్‌వాడీలకు 2 జీబీ ర్యామ్‌ సామర్థ్యం కలిగిన సెల్‌ఫోన్లను ఇచ్చింది. ఈ ఫోన్లలో తరచూ సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటంతోపాటు సరిగ్గా పనిచేయడం లేదు. దీంతో ఈసారి 4జీబీ ర్యామ్‌ సామర్థ్యం కలిగిన సెల్‌ఫోన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో 12 జీబీ ర్యామ్‌ ఉన్న సెల్‌ఫోన్లు సాధారణమైన ఈ రోజుల్లో ప్రభుత్వం 4 జీబీతో సరిపెట్టడం పట్ల అంగన్‌వాడీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆన్‌లైన్‌ ప్రాసెస్‌కు కనీసం 6 జీబీ గానీ, అంతకంటే ఎక్కువ ర్యామ్‌ సామర్థ్యం కలిగినవి సరఫరా చేసే బాగుండేది అని సీ్త్ర,శిశు సంక్షేమశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement