● ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో 5కె రన్‌ను ప్రారంభించిన కలెక్టర్ ప్రావీణ్య ● హాజరైన ఎమ్మెల్సీ అంజిరెడ్డి
సంగారెడ్డి: ప్రతీ ఒక్కరు శాసీ్త్రయదృక్పథంతో జీవించాలని, జీవనశైలిని మార్చుకుని ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 5కె రన్ కార్యక్రమాన్ని కలెక్టర్ పి.ప్రావీణ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ 5కె రన్ కార్యక్రమం మెడికల్ కాలేజీ నుంచి ఐబీ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ప్రావీణ్య మాట్లాడుతూ...రోజువారీ జీవితంలో ఒత్తిడి, చికాకు వంటి సమస్యలను తగ్గించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. యువత ఆరోగ్య పరంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వారం రోజుల పాటు పలు ఆరోగ్య కార్యక్రమాలు ఆరోగ్య శాఖ నిర్వహించిందన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా మాత్రమే వ్యక్తిగతంగా, సామాజికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ... శాసీ్త్రయదృక్పథంతో కూడిన జీవనశైలిని అనుసరించడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రకాశ్‌రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు, డీఎస్పీ సత్తయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, మెడికల్ విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు.


