ఇతర పంటలు చేతికి రావడం లేదని..
ఇతర పంటలు సాగు చేసుకున్నా వాతావరణం అనుకూలించక చేతికి అందడం లేదు. చెరకు పంటను వేసుకుంటే ఎంతో కొంత చేతికి వస్తుందనే ఆశతో 10 ఎకరాలు చెరకు పంటను సాగు చేశాను. మొదటి పంట 30 టన్నులు వచ్చే పరిస్థితి లేదు. రెండో పంట 25 టన్నుల లోపునే వస్తోంది. ఇది పెట్టుబడులకే సరిపోతోంది.
– హద్నూర్ ఓనంరెడ్డి, పస్తాపూర్
భూసారం తగ్గడంతోనే..
భూముల్లో సారం తగ్గడం వల్లే పంట దిగుబడులు రావడం లేదు. రైతులు సారం పెంచుకునేందుకు శ్రద్ధ చూపాలి. ప్రెస్‌మడ్డిని ప్రతిఏటా భూమిలో వేసుకోవడం, పచ్చిరొట్టెకింద జనుము వేసుకోవడం, అవసరం మేరకు పశువుల ఎరువులు వేసుకున్నట్లయితే పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది.
– రాజశేఖర్, కేన్ అసిస్టెంట్ కమిషనర్
ఇతర పంటలు చేతికి రావడం లేదని..


