ఎన్నికల సామగ్రి పంపిణీకి సిద్ధం
నారాయణఖేడ్: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత బుధవారం జరగనున్నాయి. మంగళవారం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, సిరా బాటిళ్లు, ఓటరు జాబితాలు తదితర సామగ్రిని పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం సబ్ కలెక్టర్ ఉమాహారతి పరిశీలించారు. మనూరు, నాగల్‌గిద్ద డిస్ట్రిబూషన్ రిసెప్షన్ సెంటర్లను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు, సలహాలను అందజేశారు. నారాయణఖేడ్ మండలానికి సంబంధించి మండలంలోని జూకల్ శివారులోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీకళాశాల ఆవరణలో టెంట్లు, కుర్చీలు, స్టేజీని ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరగనున్న ఇతర మండలాలకు సంబంధించి సంబంధిత మండల కేంద్రాల్లో ఆయా ఏర్పాట్లను పూర్తిచేశారు. పోలింగ్‌కు సంబంధించి 53 రకాల సామగ్రిని సిద్ధంగా ఉంచారు.
పరిశీలించిన సబ్ కలెక్టర్ ఉమాహారతి
ఎన్నికల సామగ్రి పంపిణీకి సిద్ధం


