మెరుగైన మెట్రోరైల్ సేవల కోసం..
ఐఐటీహెచ్‌తో ఢిల్లీ మెట్రోరైల్
కార్పొరేషన్ కీలక ఒప్పందం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశ రాజధాని ఢిల్లీలో మెట్రోరైలు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఢిల్టీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) హైదరాబాద్ ఐఐటీతో కీలక ఒప్పందం చేసుకుంది. ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్‌లో చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపడడంతో పాటు, ఇంటిగ్రేటెడ్ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఐఐటీహెచ్‌లో ప్రత్యేక పరిశోధన విభాగం టీఐహెచ్‌ఏఎన్ (టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్) సహకారాన్ని అందించనుంది. ఈ మేరకు డీఎంఆర్‌సీ, ఐఐటీహెచ్ ప్రతినిధులు కీలక ఒప్పందాలపై టీఐహెచ్‌ఏఎన్–ఐఐటీహెచ్ హబ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్‌రెడ్డి, ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ సలహాదారు శోభన్‌చౌదరిలు సంతకాలు చేశారు. టీఐహెచ్‌ఎన్ అటానమస్ నావిగేషన్ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తోంది. డ్రైవర్ రహిత వాహనాలు, డ్రోన్‌లు, బయోఇన్‌సైర్డ్ డ్రోన్లపై పరిశోధనలు చేస్తున్న విషయం విదితమే.


