
రైల్వే బ్రిడ్జికి మరమ్మతులు
బ్రిడ్జి నిర్మాణ పనులను చేపడుతున్న సిబ్బంది
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని శమ్నాపూర్ శివారులో కొట్టుకుపోయిన బ్రిడ్జికి రైల్వే శాఖ అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువు తెగిపోయి భారీగా వరద రావడంతో రైల్వేకట్టను తిరిగి పునరుద్ధరించడంలో నిమగ్నమయ్యారు. రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో పెద్ద గొయ్యి ఏర్పడి ఇరువైపులా మట్టి కొట్టుకుపోయింది. వరద శనివారం కూడా రావడంతో నీటికి అడ్డంగా ఇసుక నింపిన బస్తాలు వేసి పనులు చేపట్టారు. వీలైనంత త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

రైల్వే బ్రిడ్జికి మరమ్మతులు