
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
తూప్రాన్: పట్టణంలో వ్యక్తి అదృశ్యమైన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ శివానందం వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన బుడ్డ శ్రీను(35) భార్య హేమలత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆర్థిక సమస్యలతో గత ఆరు నెలల క్రితం పిల్లలతో కలిసి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే తల్లి సుశీల వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 3న ఇంట్లో నుంచి బ్యాంకుకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.
గుండ్లపల్లిలో వ్యక్తి..
శివ్వంపేట(నర్సాపూర్): వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని గుండ్లపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఉప్పునూతల నాగరాజు గత నెల 28న హైదరాబాద్‌లో పని చూసుకుంటానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఈ నెల 2న ఫోన్ లో మాట్లాడిన నాగరాజు అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీంతో బంధువులు, స్నేహితుల ఇండ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల
ఇద్దరు అదృశ్యమయ్యారు.

వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం