
గంజాయి అమ్ముతున్న ఇద్దరి అరెస్టు
చేర్యాల(సిద్దిపేట): గంజాయి అమ్ముతున్న ఇద్దరని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ ఎల్.శ్రీను, ఎస్‌ఐ నవీన్‌తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని లక్ష్మినర్సింహ స్వామి ఆలయం సమీపంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్, పోలీసులు కలిసి రైడ్ చేశారు. ఈ దాడిలో బొడ్డు చందు, పొన్నబోయిన పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 440 గ్రాముల గంజాయి, రెండు ఫోన్లు,పేపర్ బండిల్స్, స్పిరిట్ బాటిల్స్‌ను స్వాఽధీనం చేసుకున్నారు. విచారించగా హైదరాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
440 గ్రాముల గంజాయి స్వాధీనం