
ఇచట చూడముచ్చట
కాకతీయులు ఏలిన సంగారెడ్డి
ఇస్మాయిల్ ఖాన్
పేటలో దుర్గా భవాని అమ్మవారు
నేటి ఇస్మాయిల్‌ఖాన్ పేట
ఈశ్వరపురం(ఇస్మాయిలా ఖాన్ పేట )లో కొలువైన భవానీ మాత ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నది. సప్త ప్రకారయుత ఆకారంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు ఏకశిల రూపంలో అష్టభుజిగా, సింహావాహినిగా 13 అడుగుల ఎత్తైన భారీ విగ్రహం రూపంలో భక్తులకు అమ్మవారు దర్శమిస్తుంది. ప్రతీ ఏటా శరన్నరాత్రులతో పాటు వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. వీటితోపాటు సంగారెడ్డిలో చూడదగిన ప్రదేశాలు ఫల పరిశోధన కేంద్రం, రాజంపేటలోని రాజేశ్వర ఆలయం, వాసవీ మాత దేవాలయం, పురాతన కోటలు, గడీలతో దర్శనమిస్తున్నాయి.
విద్య, పర్యాటకం, ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవు
మంజీరాలో వలస పక్షుల సందడి
సెలయేళ్ల లాగ పారే పంట కాల్వలు
రక్షణగా కనబడే ఎత్తైన హనుమాన్ విగ్రహం
●
కాకతీయులు ఏలిన గడ్డ సంగారెడ్డి. పట్టణం చుట్టూ మంజీరా పరవళ్లు, పచ్చని పంటపొలాలు గత చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే ఎత్తైన కోటలు. ఆధ్యాత్మికత ఉట్టిపడే పురాతన ఆలయాలు ఇలా ఇంకా.. మరెన్నో చూడదగిన ప్రదేశాలతో రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న అద్భుతమైన పట్టణంపై ఈ వారం సండే సాక్షి కథనం.
– సంగారెడ్డి టౌన్

ఇచట చూడముచ్చట