
కలబ్‌గూర్ శివాలయం
కలబ్ గూర్ 11వ శతాబ్దంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడి ప్రధాన సేనాపతి శిష్యుడు ఒంటిమిట్ట ఓబలయ్య ఒకే చేతితో రాతితో నిర్మించిన శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం ఎంతో మహిమాన్వితం గలది. ఆలయంలో ప్రధానంగా అనంత పద్మనాభస్వామి విగ్రహం, శివలింగం దర్శనమివ్వడం... సూర్య కిరణాలు దేవతామూర్తులపై పడటం మరో విశేషం. ఇక్కడి ఆలయం త్రికూట ఆకారంలో ఉండి, ఆలయం ముందు కోనేరు, ఒకే చోట శివుడు, అనంత పద్మనాభస్వామి, వేణుగోపాలస్వామి కొలువై ఉన్నారు. శివరాత్రితో పాటు పలు పర్వదినాల్లో భక్తులు వచ్చి విశేష పూజలు చేస్తారు. నందీశ్వరుడు, ధ్వజ స్తంభం స్వాగతం పలుకుతూ ఆలయ ఆవరణ అంతా వెయ్యి స్తంభాల గుడిని గుర్తుకుతెస్తాయి.