
హైకోర్టు స్టే హర్షణీయం
మసీదు నిర్వహణపై ముతవల్లీ డాక్టర్ అబ్దుల్ మజీద్
నారాయణఖేడ్: ఖేడ్‌లోని హష్మీ మసీదు ప్రత్యక్ష నిర్వహణ బాధ్యతలను వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌కు కల్పిస్తూ వక్ఫ్‌బోర్డు ఉత్తర్వులివ్వడంపై హైకోర్టు స్టే ఇవ్వడం హర్షణీయమని మసీదు ముతవల్లీ డా.అబ్దుల్ మజీద్ పేర్కొన్నారు. ఖేడ్‌లో శనివారం మసీదు సబ్ ముతవల్లీ మొహిదాఖాన్‌తోపాటు పట్టణ ముస్లిం పెద్దలు ముంతాజ్, తౌసిఫ్, జకిరియాఖురేషి, మీర్ సాజిదలీ, ఖదీర్, ఫయాజ్, ఖతీబ్, అజీమ్ తదితరులతో కలసి విలేకరులకు స్టే ఉత్తర్వులను చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మసీదుకు 90 ఎకరాల భూములున్నాయన్నారు. భూములను అన్యాక్రాంతం చేసేందుకు ఈ ప్రాంతంతో ఎలాంటి సంబంధం లేనివారు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మసీదు భూములు, ఆస్తుల పై కోర్టు ఇదివరకే ఇంజక్షన్ ఆర్డరిచ్చినా మసీదు నిర్వహణ, ఆస్తులపై ప్రత్యక్ష బాధ్యతలను వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించడాన్ని సవాల్ చేయగా కోర్టు స్టే ఇచ్చిందని వివరించారు.