ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం

Sep 8 2025 9:56 AM | Updated on Sep 8 2025 9:56 AM

ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం

తూప్రాన్‌: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఆదివారం లయనన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ 320–డీ ఆధ్వర్యంలో ‘దిల్‌ సే గురు వందనం’ పేరుతో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కిష్టాపూర్‌ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ధవళ ధనలక్ష్మిని సన్మానించారు. విద్యారంగంలో విశిష్ట సేవలందించిన ఆమె ప్రతిభకు ఈ గుర్తింపు దక్కిందని, పురస్కారం అందుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. తూప్రాన్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు లయన్‌ పల్లెర్ల రవీందర్‌ గుప్త, సెక్రెటరీ లయన్‌ డాక్టర్‌ జానకిరామ్‌, మండల విద్యాధికారి సత్యనారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లయన్‌ డాక్టర్‌ బాబురావు, విద్యాశాఖ మాజీ కమిషనర్‌ డాక్టర్‌ కే.లక్ష్మినారాయణ ఐఎఎస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement