
ఆత్మరక్షణకు కరాటే దోహదం
పటాన్‌చెరు టౌన్: క్రమశిక్షణ, ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం చేవెళ్ల నియోజకవర్గం.. శంకర్‌పల్లి మున్సిపాలిటీ మోకిల పరిధిలోని పీ.ఆర్‌ఆర్ గార్డెన్‌న్స్‌లో నిర్వహించిన 11వ స్టేట్ లెవెల్ సక్సెస్ షోటోకాన్ కరాటే చాంపియన్ షిప్–2025 పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలన్నారు. ఎంతోమంది కరాటే సాధకులకు పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులు కుమార్, స్పాన్సర్ వెంకటేశ్‌లను అభినందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.