
రోడ్డు కోసం ఆందోళన
పటాన్‌చెరు టౌన్: ప్రమాదాలకు నిలయంగా మారిన రోడ్డును బాగు చేయాలని కాలనీవాసులు పిల్లలతో కలిసి ప్లకార్డులు, బ్యానర్లతో ఆందోళన చేశారు. వివరాలు... ఆదివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మిర్చి డెవలపర్స్ వెనిసిటీ, ఎం.పీ.ఆర్ అర్బన్ సిటీ కాలనీ వాసులు పాటీ చౌరస్తా నుంచి అర్బన్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ... మూడు, నాలుగేళ్ల నుంచి రోడ్డును బాగు చేయాలని స్థానిక నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. నిత్యం వందల వాహనాలు ఈ మార్గంలో తిరుగుతాయని, ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మరింత గుంతలమయంగా మారిందన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కొత్త రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర కాశి , యశ్వంత్, శ్రవణ్, వేణు, రాఘవ, శ్రీకాంత్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
ర్యాలీ చేపట్టిన కాలనీవాసులు