
చెట్టును ఢీకొట్టిన కారు
ఒకరి మృతి.. నలుగురికి గాయాలు
చేగుంట(తూప్రాన్): కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన చేగుంట శివారులోని జీవిక పరిశ్రమ బోనాల్ రహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు కారులో బోనాల వైపునకు వెళుతున్నారు. ఈక్రమంలో కారు వేగంగా చెట్టును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నరేశ్, సాయితేజ్, ప్రణయ్, స్వామిలకు తీవ్రగాయాలు కాగా సాయితేజ గౌడ్(23) మృతి చెందాడు. క్షతగాత్రులను తూప్రాన్ ఆస్పత్రికి తరలించారు. విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

చెట్టును ఢీకొట్టిన కారు