
ఎల్లయ్య మరణం తీరని లోటు
మాజీమంత్రి టి.హరీశ్‌రావు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): భెల్ సీనియర్ కార్మిక నేత జి.ఎల్లయ్య మృతి తెలంగాణ సమాజానికి తీరనిలోటని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. రామచంద్రాపురం శనివా రం జరిగిన ఎల్లయ్య అంతిమయాత్రలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. భెల్ కార్మికుల హక్కుల సాధనకోసం ఆయన చేసి కృషి విస్మరించరానిదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఎల్లయ్య అంతిమయాత్రలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్ సింధురెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
బెల్ ప్రధాన గేటు వద్ద ..
జి.ఎల్లయ్య పార్ధివ దేహన్ని కార్మికుల కోసం బెల్ ప్రధాన గేట్ సమీపంలో కొంత సమయం ఉంచి ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పాల్గొన్నారు.