
ఉమ్మడికే జై.. ఒక్కరిద్దరికే సై
సిద్దిపేట జిల్లాలో 2,38,049 గృహాలున్నాయి. మొత్తం 10,12,065 జనాభా ఉంది. వీరిలో 5,04,141 మంది పురుషులు, 5,07,924మంది మహిళలు ఉన్నారు. నూతన టెక్నాలజీ, మారుతున్న పరిస్థితులు, ఆలోచన విధానం, ఉద్యోగ, వ్యాపార రీత్యా కొంత మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. యువత జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి, పిల్లలు అనే ఆలోచనతో ఉన్నారు. 30 ఏళ్లు దాటిన యువత చాలా మంది జీవితంలో స్థిరపడక పోవడంతో వివాహాలకు వెనకడుగు వేస్తున్నారు. జనాభా పెరగడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. జనాభా పెరుగుతున్న కారణంగా ఆహార ధాన్యాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు.
చ.కి.మీటర్‌కు సగటున 340 మంది
సంగారెడ్డి జిల్లాలో 4.492.07 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం 15,27,301 మంది జనాభా ఉన్నారు. ఒక చదరపు కిలోమీటర్‌కు జనసాంద్రత 340 నమోదై ఉంది. 15 లక్షల పైగా జనాభా ఉండగా ఇందులో దాదాపు 50 శాతానికి పైగా యువత మరియు వృద్ధులే ఉన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడితే వే లాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటు న్నారు. దీంతో విపరీతమైన పోటీ నెలకొంది. అటు ప్రైవేట్ రంగంలోనూ పోటీ ఉంది. దీనికంతటికి ప్రధాన కారణం పెరుగుతున్న జనాభా అనుగుణంగా వనరులు లేకపోవడం అని గణాంకాలు సృష్టం చేస్తున్నాయి. జనాభా పెరుగుదల వల్ల నివాస సముదాయాలు పెరిగిపోవడం, రియల్ ఎస్టేట్ రంగం వ్యాప్తి చెందుతుండటంతో క్రమంగా అటవీ విస్తీర్ణం తగ్గిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి.
ప్రస్తుత సమాజ ంలో ఉమ్మడి కుటుంబానికే ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కలిసి ఉంటేనే కలదు సుఖమంటూ పెద్దలు చెప్పిన మాటను నిజం చేస్తున్నారు. సమాజంలో మారిన జీవన పరిస్థితులు, కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ పట్టణాల్లో స్థిరపడి పెద్దలకు దూరంగా ఉంటున్నారు. దీని వల్ల చిన్న చిన్న సమస్యలకే గొడవలు పడి, ఓపిక లేక వివాహమైన కొన్ని నెలలకే విడిపోతున్నారు. అదే ఉమ్మడి కుటుంబంలో ఉంటే మనోఽధైర్యం కల్పించి కుటుంబ సభ్యులు అండగా ఉంటారు. గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న దంపతులు ఉమ్మడి కుటుంబంతోనే సంతోషంగా ఉండవచ్చని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. నేడు ప్రపంచ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. సిద్దిపేటకమాన్ / సంగారెడ్డి క్రైమ్:
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న వైనం
సెటిలయ్యాకే వివాహం అంటున్న యువత
ఉమ్మడి కుటుంబాలు మేలంటున్న పలువురు
సిద్దిపేట జిల్లాలో 10,12,065 జనాభా
అధిక జనాభాతో అనర్థాలు
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
జనాభాను నియంత్రించాలి
నేను నా భార్య అనిత, మూడేళ్ల పాప శ్రీనికతో కలిసి పట్టణంలోని వివేకానంద కాలనీలో ఉమ్మడి కుటుంబంగా నివాసం ఉంటున్నాం. అన్నయ్య, వదినె, పిల్లలు, అమ్మతో పాటు మొత్తం 8మందితో సంతోషంగా ఉన్నాం. ఆడ, మగ అని తేడా లేకుండా పిల్లలను బాగా చదివించి, వారికి భవిష్యత్‌ను అందించాలి. ప్రభుత్వాలు కూడా అందుకు అనుగుణంగా విద్య, వైద్యం వంటి రంగాల్లో సౌకకర్యాలు కల్పించాలి. జనాభా నియంత్రణపై అవగాహన కల్పించాలి.
– గుండబోయిన కిరణ్ అనిత, సిద్దిపేట
ఉమ్మడి కుటుంబాలకే మొగ్గు
ప్రస్తుతం సమాజంలో మారిన జీవన పరిస్థితులు, కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ పట్టణాల్లో స్థిరపడి పెద్దలకు దూరంగా ఉంటున్నారు. యువత వేరు కాపురం పెట్టడం వల్ల చిన్న చిన్న సమస్యలకే గొడవలు పడి, ఆలోచన, అనుభవం, ఓపిక లేకపోవడంతో వివాహమైన కొన్ని నెలలకే విడిపోతున్నారు. మరి కొంత మంది తమకు ఆడ, మగ అని తేడా లేకుండా ఒక్కరు చాలు అని వారికి ఉన్నత చదువు నేర్పించి జీవితంలో ఉన్నత స్థానంలో చూడాలని కోరుకుంటున్నారు. అలాగే గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న దంపతులు ఉమ్మడి కుటుంబంతో సంతోషంగా ఉండవచ్చని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
జనాభా పెరిగితే ఏర్పడే సమస్యలు
ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది.
అడవులు అంతరించిపోతాయి.
ఆకలికేకలు, ఆరోగ్యం ఇబ్బందిపెడతాయి.
సహజ వనరులు లేకపోవడంతో భవిష్యత్ అవసరాలకు ఆటంకంగా మారుతుంది.
జనాభాకు అనుగుణంగా ప్రభుత్వాలు
అవసరాలు తీర్చాలి.
నిరుద్యోగం సమస్య పరిణమిస్తుంది.

ఉమ్మడికే జై.. ఒక్కరిద్దరికే సై