
ట్రాక్టర్ బోల్తా
అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటన మండలం కపూర్‌నాయక్ తండా గ్రామ పరిధిలోని శ్రీరాం తండాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు ఇలా... తండావాసులకు తాగునీరు సరఫరా చేసేందుకు వెళుతున్న వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి కాలేదు. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతోనే ట్రాక్టర్ బోల్తాపడినట్లు తండావాసులు వాపోయారు.
బస్సు, బైక్ ఢీ..
● ఒకరికి తీవ్ర గాయాలు
కౌడిపల్లి(నర్సాపూర్): బస్సు, బైక్ ఢీకొనడంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రమైన కౌడిపల్లి బస్టాండ్ వద్ద 765డి జాతీయ రహదారిపై గురువారం జరిగింది. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి వివరాల ప్రకారం... చిలప్‌చెడ్ మండలం రాందాస్‌గూడ గ్రామానికి చెందిన గణేష్ తన బైక్‌పై కౌడిపల్లికి వచ్చి బస్టాండ్‌వద్ద యూటర్న్ తీసుకుంటున్నాడు. అదే సమయంలో బస్టాండ్ నుంచి పల్లెవెలుగు బస్సు రోడ్డుపైకి రావడంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై ఉన్న గణేష్ కిందపడగా తీవ్రగాయాలయ్యాయి. దీంతో బాధితున్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వెల్దుర్తి(తూప్రాన్): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని యశ్వంతరావ్‌పేట తండాలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు వివరాల ప్రకారం... తండాకు చెందిన నేనావత్ దుర్గ్య, జయరాంలు అన్నదమ్ములు. భూమి పంపకం విషయంలో గత నెల 29న గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా దుర్గ్య వెళ్లలేదు. కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని బహుదూర్‌పల్లిలో నివాసముంటున్న జయరాం(55) ఆ రోజు రాత్రి తండాలోనే ఉండి మరుసటిరోజు బహుదూర్‌పల్లి వెళ్లిపోయాడు. దీంతో కొద్ది సేపటికే కింద పడిపోగా చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. తన భర్తను అతని సోదరుడు దుర్గ్య, వదిన రాణి దారుణంగా కొట్టడంతోనే నీరసంతో మృతి చెందాడని మృతుడి భార్య జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో
సైబర్ మోసం
– రూ.35 లక్షలు పోగొట్టుకున్న గృహిణి
పటాన్‌చెరు టౌ్‌న్ : నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో ఓ గృహిణి రూ.35 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటన అమీన్‌న్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుప్రజ హోమ్స్‌కు చెందిన మహిళకు ఏప్రిల్ 2న ట్రేడింగ్‌కు సంబంధించిన ఒక మెసేజ్ వచ్చింది. దీంతో ఆన్‌న్‌లైన్ ట్రేడింగ్‌లో అకౌంట్ కోసం తన వివరాలను యాప్‌లో నమోదు చేసింది. అనంతరం నిర్వాహకులు ఒక ఐడీని క్రియేట్ చేసి ఇచ్చారు. దీంతో ఆ గృహిణి నగదును ఆన్‌న్‌లైన్‌లో పలు దఫాలుగా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. పెట్టిన నగదుతో పాటు, లాభాలు చూపిస్తూ అపరిచిత వ్యక్తి వచ్చాడు. అయితే బాధితురాలు.. కుటుంబ సభ్యులు తన ఖాతాలో ఉంచిన నగదును ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. రూ.35 లక్షలు పెట్టిన అనంతరం తాను పెట్టిన నగదుతో పాటు, లాభాలను ఇవ్వాలని అడగగా అపరిచిత వ్యక్తులు స్పందించలేదు. దీంతో బాధితురాలు తాను మోసపోయినట్లు గుర్తించి, సైబర్ క్రైమ్ పోలీసులకు, అమీన్‌న్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాక్టర్ బోల్తా

ట్రాక్టర్ బోల్తా