
ఆలయాల ధ్వంసానికి కుట్ర
● మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆరోపణ
● రుద్రారం ఆలయం పరిశీలన
పటాన్‌చెరు టౌన్: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, పిచ్చివాళ్ల పేరిట ఆలయాల ధ్వంసానికి ఆ పార్టీ కుట్ర చేస్తోందని ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. పటాన్‌చెరు మండలం రుద్రారంలోని హనుమాన్ ఆలయంలో గురువారం రాత్రి విగ్రహాల ధ్వంసం ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి గ్రామస్తులు,పోలీసులతో కలసి రఘునందన్‌రావు శుక్రవారం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి, సదాశివపేట,రుద్రారం ఆలయాల్లో దాడులు చేసింది పిచ్చివాళ్లు అనిచెప్పి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. పిచ్చివాళ్లకు సీసీ కెమెరాలు తొలగించి దాడులు చేయాలనే అవగాహన ఉండటమేమిటోనని అర్థం కావడంలేదన్నారు.