
ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటాం
మెదక్‌జోన్: మెదక్‌లో చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ (సీబీఎస్)ను ప్రముఖ నటి వైష్ణవిచైతన్య, టీవీ చానల్స్ నటి వర్షా, నూకరాజు గురువారం ప్రారంభించారు. వీరిని చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలిరావటంతో సందడి నెలకొంది. సెల్ఫీలు దిగేందుకు యువత పోటీపడ్డారు. షోరూం మేనేజింగ్ డైరెక్టర్ జానా సురేష్ మాట్లాడుతూ.. తమ సంస్థలను తెలుగు రాష్ట్రాలలో ప్రారంభించిన ప్రతి చోటా అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందుతున్నాయని చెప్పారు. మెదక్‌లో కూడా ప్రజల ఆదరాభిమానాలు చూరగొనేలా వస్త్రాలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఇక్కడి ప్రజల ఆదాయ వనరులకు అనుగుణంగా ధరలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఆషాఢం, శ్రావణ మాసం వేడుకల సందర్భంగా అన్నిరకాల వస్త్రాలపై తగ్గింపు ధరలతో వినియోగదారులను అందిస్తామన్నారు.
చందన బ్రదర్స్ షోరూం మేనేజింగ్ డైరెక్టర్ జానా సురేష్
మెదక్‌లో షాపింగ్ మాల్ ప్రారంభం