
ములుగు వర్సిటీకి అవార్డు
ములుగు(గజ్వేల్): ఐఐటీ బాంబే నుంచి ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ఎడ్యుకేషన్ కేటగిరిలో ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉత్తమ యూనివర్సిటీ అవార్డు అందుకుంది. గురువారం ఐఐటీ ముంబైలో జరిగిన ఓపెన్–సోర్స్ జీఐఎస్ దినోత్సవ వేడుకలు, నేషనల్ జియోస్పేషియల్ అవార్డును ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మాజీ చైర్మన్ కిరణ్‌కుమార్ చేతుల మీదుగా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. జియోస్పేషియల్ చొరవలు, క్రియాశీల భాగస్వామ్యం గురించి అవగాహన కల్పించడంలో ఆదర్శప్రాయమైన మద్దతును గుర్తించి ఐఐటీ ముంబై ఉద్యాన వర్శిటీ ఈ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా వైస్ చాన్స్‌లర్ రాజిరెడ్డి మాట్లాడుతూ ఉద్యాన రంగంలో భౌగోళిక సమాచార వ్యవస్థ, జీఐఎస్ మ్యాపింగ్ ప్రాముఖ్యతను అందించడంలో ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటికే ఉద్యాన తోటలను మ్యాపింగ్ చేయడం, తెలంగాణ ఉద్యాన రంగంలో అప్లికేషన్‌లను ముమ్మరం చేసి రైతులకు సాగును లాభసాటిగా మార్చేందుకు ఇవి ఉపయోగపడుతాయని ఆయన వివరించారు. త్వరలోనే విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జీఐఎస్ హ్యాకథాన్‌ను కూడా నిర్వహిస్తామని వీసీ పేర్కొన్నారు. అలాగే.. ఎక్సలె న్స్ ఇన్ జౌట్‌రీచ్ అవార్డును కన్సల్టెంట్ డాక్టర్. వీరా ంజనేయులకు అందజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్ తదితరులు పాల్గొన్నారు.