
ఆర్టీసీని ఆదరిస్తే మరిన్ని మెరుగైన సేవలు
డయల్‌యువర్ డీఎంలో మల్లేశయ్య
నారాయణఖేడ్: ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆదరిస్తే మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు అవకాశం ఉందని ఖేడ్ ఆర్టీసీ డీఎం మల్లేశయ్య తెలిపారు. ఖేడ్ ఆర్టీసీ డిపోలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖేడ్‌కు చెందిన గౌలి మెఘారాం ఖేడ్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు, కంగ్జికి చెందిన సుభాష్ కంగ్జి, దెగుల్‌వాడీ, చింతాకి మీదుగా కర్ణాటకలోని బీదర్‌కు బస్సులు నడపాలని కోరారు. తడ్కల్‌కు చెందిన వెంకటేశం కంగ్టి నుంచి తడ్కల్‌మీదుగా పిట్లంకు, తాటిపల్లికి చెందిన బాగారెడ్డితో పాటు తాటిపల్లిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రాణి, శ్రీలత, సంగీత, వెంకట్‌రెడ్డి పాఠశాల సమయానికి చేరుకునేలా బస్సు సమయాన్ని మార్చాలని కోరారు. బీబీపేటకు చెందిన గుండుమోహన్, సిర్గాపూర్‌కు చెందిన నర్సింహులు నల్లవాగు, బీబీపేట, ఫత్తేపూర్ మీదుగా పిట్లంకు, మునిగేపల్లికి చెందిన బషీర్ నిజాంపేట ఫ్లైఓవర్ వంతెన వద్ద రిక్వెస్ట్‌స్టాప్ ఏర్పాటు చేయాలని, వంగ్దాల్ మాజీ సర్పంచ్ భీమ్‌రావుపటేల్ విద్యార్థుల సౌకర్యార్థం తమ గ్రామానికి బస్సు నడపాలని విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలను నమోదు చేసుకున్న డీఎం ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
ఎంపీ కొండా
క్షమాపణలు చెప్పాలి
కొండాపూర్(సంగారెడ్డి): రాష్ట్రంలో వరి సాగు అవసరం లేదంటూ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని రాష్ట్ర రైతాంగానికి వెంటనే ఆయనతోపాటు బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దశరథ్ డిమాండ్ చేశారు. కొండాపూర్ మండలంలోని మందాపూర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దశరథ్ మాట్లాడుతూ...రాష్ట్రంలో వరి సాగు వద్దని చెప్పి రైతులను భయభ్రాంతులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. బియ్యం తినకుండా బతకలేమా? తెలంగాణకు బియ్యం అవసరమా అని మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించారు? కార్యక్రమంలో సీపీఐ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరిలో కాంప్లెక్స్
ఎరువులు తగ్గించాలి
కల్హేర్(నారాయణఖేడ్): వరిలో పైపాటుగా కాంప్లెక్స్ ఎరువుల వాడకం తగ్గించాలని నారాయణఖేడ్ ఏడీఏ నూతన్‌కుమార్ సూచించారు. మండలంలోని రాపర్తిలో వరి సాగు విధానంపై శుక్రవారం రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. అధికారుల సలహాలు పాటించాలని కోరారు. అనంతరం రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓ వెంకటేశం, ఏఈఓ కృష్ణవేణి, రైతులు హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.
సిగాచీ బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
పటాన్‌చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సిగాచీ పరిశ్రమలో ప్రమాదంలో ఇంతవరకు ఆచూకీ లేని ఇస్నాపూర్‌కు చెందిన సిల్వర్ రవి కుటుంబాన్ని శుక్రవారం ఎమ్మెల్యే సునీతారెడ్డి పరామర్శించారు. రవి భార్య దివ్య, పిల్లలు లౌక్య, అద్విక్ లను కలిసి వారికి ధైర్యం చెప్పి వారిని ఓదార్చారు.

ఆర్టీసీని ఆదరిస్తే మరిన్ని మెరుగైన సేవలు

ఆర్టీసీని ఆదరిస్తే మరిన్ని మెరుగైన సేవలు