
నానో యూరియా, డీఏపీతో ప్రయోజనాలు
పాపన్నపేట(మెదక్): నానో యూరియా, డీఏపీ వాడకంతో అధిక ప్రయోజనాలు ఉంటాయని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త రవికుమార్ రైతులకు సూచించారు. శుక్రవారం ఆయన వ్యవసాయ అధికారులతో కలిసి మండలంలోని తమ్మాయపల్లి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. నానో డీఏపీ వాడకం వల్ల పంటకు అధిక ప్రయోజనాలు చేకూరుతాయని, దీంతో ఎరువులు ఆదా అవుతాయని తెలిపారు. నేల ఆరోగ్యంగా ఉండేలా చూస్తుందన్నారు. పీఎస్‌బీ వాడకం వల్ల నేలలో ఉన్న భాస్వరం త్వరగా కరుగుతుందని చెప్పారు. నానో యూరియా స్ప్రే చేసిన 4 గంటల్లోపు 95 శాతం శోషించుకుంటుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగమాధురి, ఏఈఓ నాగరాజు, రైతులు రాంరెడ్డి, అనీల్ రెడ్డి, సాయిలు, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ శాస్త్రవేత్త రవికుమార్