
పందిరి సాగు ఎంతో లాభదాయకం
కొండపాక(గజ్వేల్): పందిరి తోటల కూరగాయల సాగు ఎంతో లాభదాయకమని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బందారం శివారులో రైతు అమ్మన రాజిరెడ్డి 30 ఎకరాల్లో సాగు చేస్తున్న పందిరి కాకర, బీర కూరగాయల క్షేత్రాన్ని శుక్రవారం అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో కలిసి సందర్శించారు. పశువుల ఎరువును సేంద్రీయ ఎరువుగా తయారు చేసే యూనిట్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పందిరి సాగుకు ప్రభుత్వం రూ. లక్ష వరకు సబ్సిడీ ఇస్తుందని, కానీ ఎకరాకు సుమారు రూ. 4లక్షల వరకు ఖర్చు అవుతుందని వీసీ రాజిరెడ్డి దృష్టికి రైతు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. కూలీల కొరతను అధిగమించి యంత్ర పరికరాలతో పండించిన కూరగాయలను మద్రాస్‌తోపాటు ఖమ్మం వరంగల్,కరీంనగర్, హైదరాబాద్‌లోని మార్కెట్‌ల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతు రాజిరెడ్డి దంపతులను వైస్ చాన్స్‌లర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ జిల్లా అధికారి సువర్ణ, మండల అధికారి కౌసల్య, యూనివర్సిటీ అధికారులు సురేష్‌కుమార్, భగవాన్, చీనా, లక్ష్మినారాయణ,నాయకులు దుర్గయ్య, కరుణాకర్‌రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.
హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి